బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు
తేదీ :04/11/2024
బూర్గంపాడు మండలం
=====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, వరు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే పత్తిని ఎక్కువగా పండించే మండలం మన బూర్గంపాడు మండలం అని ఎక్కువ దిగుబడి కూడా బూర్గంపాడు మండలంలోనే సేకరిస్తున్నారని సీసీఐ కేంద్రాన్ని మీ అందరి సమక్షంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని రైతు సోదరులకు 2024,25 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన మద్దతు ధర కింటాకు 7581 రూపాయి కేటాయించడం జరిగిందని ఆ మద్దతు ధర పొందాలంటే సిసిఐ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా రైతును సంతోషంగా పండించినటువంటి పత్తిని సిసిఐ కేంద్రం వారు ఒప్పుకునే విధంగా వెసులుపాటు ఉండాలని రైతుల పక్ష విపేక్షత చూపొద్దని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు, ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్గంపూడి కృష్ణా రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు