కరకగూడెం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
తేదీ:24/12/2024
ప్రాంతం: కరకగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన 102 అంబులెన్స్ ప్రారంభం: కరకగూడెం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు DMHO భాస్కర్ నాయక్ గారి సమక్షంలో నూతన 102 అంబులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కారం మధు గారు ఎమ్మెల్యే పాయంను పుష్పగుచ్చంతో సత్కరించారు.ఎమ్మెల్యే పాయం గారు మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్‌లు కేటాయించడంలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.
తాటి గూడెం గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభం:
తాటి గూడెం గ్రామంలో 20 లక్షల అంచనాతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయం గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యాలయానికి స్థలాన్ని విరాళంగా అందించిన కొమరం వెంకటమ్మ, సత్యవతి, విజయలను సన్మానించారు. అనంతరం గ్రామ సమస్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి మౌలిక వసతులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద కుటుంబాలకు ఇండ్లు నిర్మించేందుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.
CMRF చెక్కుల పంపిణీ:
తాటి గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భాగంగా 20 మంది లబ్ధిదారులకు రూ. 6,50,000 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాలలో DMHO భాస్కర్ నాయక్, ఎమ్మార్వో నాగ ప్రసాద్, కరకగూడెం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, సర్పంచులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం:ఈ పర్యటనలో పాయం గారు గ్రామాభివృద్ధి కోసం కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. “ప్రజల కోసం నిష్టతో పనిచేస్తా” అని స్పష్టం చేశారు.
