మణుగూరు రైలు సర్వీసులు పునరుద్ధరణకు ఎమ్మెల్యే పాయం వినతి
న్యూఢిల్లీ: మణుగూరు నుంచి నాలుగు రైలు సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రైల్వే సహాయ మంత్రి రవనిత్ సింగ్ బిట్టు గారిని న్యూఢిల్లీలో కలిశారు.
ఈ సందర్భంగా మణుగూరు మండలంలోని కూనవరం లో నూతన రైల్వే స్టేషన్ నిర్మించాల్సిన అవసరాన్ని, అలాగే కొత్తగూడెం నుంచి అదనపు రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ బలరాం నాయక్ తో కలిసి ఎమ్మెల్యే పాయం మంత్రి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. రైలు సర్వీసులు పునరుద్ధరణతో మణుగూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే పాయం పేర్కొన్నారు.