సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో వ్యవసాయ మార్కెట్లో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ… సీసీఐ కేంద్రాన్ని మీ అందరి సమక్షంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని రైతు సోదరులకు 2024,25 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన మద్దతు ధర కింటాకు 7521/- రూపాయి కేటాయించడం జరిగిందని ఆ మద్దతు ధర పొందాలంటే సిసిఐ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా రైతును సంతోషంగా పండించినటువంటి పత్తిని సిసిఐ కేంద్రం వారు ఒప్పుకునే విధంగా వెసులుపాటు ఉండాలని రైతుల పక్ష విపేక్షత చూపొద్దని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి పిఎసిఎస్ డైరెక్టర్ & అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కని మధుసూదన్ రెడ్డి, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి,జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ నరేందర్,
ఏడీఏ తాతారావు, ఏఓ సాయి శంతన్ కుమార్,  ఎంపిడిఓ వరప్రసాద్, ఏంపీఓ ముత్యాలరావు, ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *