కొత్త సంఘాల ఏర్పాటు కోసం మహిళా శక్తి కార్యక్రమంలో కోటి రూపాయల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ఆళ్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొని, అర్హులైన వారికి కొత్త సంఘాల ఏర్పాటుకు పాస్ బుక్కులు మరియు పాత సంఘాల వారికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా, పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ: “కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, అందులో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఎలాంటి పథకమైనా మహిళల పేరుతోనే అమలు చేస్తామని, ప్రభుత్వం ప్రతి ఉపాధి కల్పన పథకాన్ని మహిళలకు సద్వినియోగం చేస్తూ, మహిళా శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఆళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాయం రామ నరసయ్య, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.