బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ఎమ్మెల్యే పాయానికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: బూర్గంపాడు మండలం, మోతే పట్టినగర్ లో బిటి రోడ్డు 2 కిలోమీటర్ల
మేరకు 1 కోటి 20 లక్షలు వ్యయంతో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజక వర్గం యొక్క అభివృద్దే తన ప్రథమ లక్ష్యం అని అన్నారు. సావిడ ప్రజలు పలు సమస్యలుపై ఎమ్మెల్యే సాయం కి వినతి పత్రాలు అందజేశారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కారం కోసం కృషి చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు