ప్రజా పాలన విజయోత్సవం – పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘనతకు నిదర్శనం
03/12/2024 , బూర్గంపాడు మండలం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు, గుత్తా అమిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, కాంగ్రెస్ శ్రేణుల ఆత్మీయ స్వాగతం పొందారు.అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలను వేడుకగా ఘనంగా నిలిపారు.
సభలో మాట్లాడిన పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతుల కోసం రూ. 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతోందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయటం దేశ చరిత్రలోనే వినూత్నమైన ఘట్టమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు.
పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు గౌరవం కల్పిస్తానని, రానున్న పంచాయితీ ఎన్నికల్లో వారికి అవకాశాలు కల్పించి గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, మండల నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సభలో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలపరుస్తూ ప్రజా పాలన విజయోత్సవం చిరస్థాయిగా నిలిచేలా ఏర్పాటుచేయబడింది.
