పినపాక నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు
మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పినపాక నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని తెలిపారు
ఈ వర్షాలకు వాగులు, వంకలు, గోదావరి, వరద వచ్చే అవకాశం ఉందని ప్రజలు గమనించి రాకపోకలు, సాగించవద్దని సూచించారు.
ముఖ్యంగా చేపల వేటకు వెళ్లవద్దని,అత్యవసరమైతే తప్ప బయటికి రావాలి కానీ, అనవసరంగా బయట తిరగవద్దని తెలిపారు
వర్షాలకు గ్రామాలలో వరదలు సంభవిస్తే సంబంధిత అధికారులు ఆ గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రాంతాలను గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను అదేశించారు.
గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుందని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, వరద ఉధృతిని అంచనా వేస్తూ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
ముంపు ప్రాంతాల్లోకి వరదలు సంభవిస్తే ,వెంటనే ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలిరావలని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు