400000, లక్షల విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
తేదీ :08/01/2025
కరకగూడెం మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం సమీక్ష సమావేశంలో భాగంగా కరకగూడెం మండలానికి చెందిన CMRF లబ్ధిదారులకు 400000, లక్షల విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, పాయం గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, మీ కుటుంబంలో అనారోగ్య పాలై మెరుగైన వైద్యం చేపించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తుందని ఈ డబ్బులు జాగ్రత్తగా మీ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు , మహిళా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు