4o
110-PINAPAKA CONSTITUENCY
వాగు బోయిన పొట్టెమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
తేదీ: 12.11.2024
స్థలం: మణుగూరు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భగత్ సింగ్ నగర్ రామాలయం వీధికి చెందిన వాగు బోయిన పుల్లయ్య సతీమణి వాగు బోయిన పొట్టెమ్మ అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి, పొట్టెమ్మ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి, తమ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు టౌన్ ప్రెసిడెంట్ శివ సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.