పినపాక భూపాలపట్నంలో ఇంటింటా సర్వే సమీక్షించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 మణుగూరు,12.11.2024 , పినపాక మండల పర్యటనలో భాగంగా భూపాలపట్నంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, కుటుంబ అంశాలపై ఇంటింటా సర్వేను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పూర్తి వివరాలను సర్వే అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

ఇంటింటా సర్వే ప్రతి కుటుంబంలో జరుగుతుందని, సర్వే సమయంలో ఇంటి యజమాని కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఇవ్వాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్, MPDO రాఘవరపు రామకృష్ణ, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిశాల రామనాథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *