ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, DCMS అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో DCMS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, DCMS అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మకుండా నేరుగా కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యం రేటును రూ. 2320, సాధారణ ధాన్యం రేటును రూ. 2300 గా నిర్ణయించిందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి నాణ్యంగా కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం 30 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని, కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరగకుండా చూడాలని తెలిపారు. సన్నధాన్యానికి రాష్ట్రం 500 రూపాయలు బోనస్ ప్రకటించిందని, ఈ బోనస్ డబ్బులు 10-15 రోజులలో జమ అవుతాయని, రైతులు అధైర్యపడవద్దని తెలిపారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి ఓపీఎంఎస్ చేయించి డబ్బులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ADA తాతారావు, మణుగూరు ఎమ్మార్వో రాఘవరెడ్డి, MPDO శ్రీనివాసరావు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు