పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు, బూర్గంపాడు పర్యటన
తేదీ: 11 నవంబర్ 2024
స్థలం: మణుగూరు, బూర్గంపాడు మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు మణుగూరు మరియు బూర్గంపాడు మండలాలలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఆయన పర్యటనలో ప్రధానంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలు, మైనార్టీ డే ఉత్సవాలు జరుగనున్నాయి.
కార్యక్రమం వివరాలు:
- ఉదయం 9:00 గంటలకు: మణుగూరు మండలం రామాంజవరం – ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం.
- ఉదయం 9:30 గంటలకు: మణుగూరు సమితి సింగారం – ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం.
- ఉదయం 11:00 గంటలకు: బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర – ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం.
- ఉదయం 11:30 గంటలకు: బూర్గంపాడు – తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ వద్ద మైనార్టీ డే కార్యక్రమం.
- మధ్యాహ్నం 12:00 గంటలకు: బూర్గంపాడు మండలం సారపాక – మైనార్టీ డే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఇట్లు,
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మణుగూరు