ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
తేదీ :08/11/2024
మణుగూరు మండలం
======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గౌ!! శ్రీ!! ఎనుముల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీపాయం గారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్న తరుణంలో పిసిసి అధ్యక్షులు పదవి బాధ్యతను స్వీకరించి అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఆనాడు అధికార పార్టీలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాటకి మాటే సమాధానం అని వారు చేస్తున్న అన్యాయాన్ని అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఒక నిజమైన నాయకుడుగా నిరూపించుకుని ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చి తెలంగాణ ప్రజల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని తిరుగులేని నాయకుడిగా ఎదిగారని తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమలు రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం, ఇందిరమ్మ ఇల్లు ఇలా మరెన్నో పదకాలను పేద ప్రజలకు అందిస్తూ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిన మన ప్రియతమ నాయకులు గౌ!! శ్రీ!! రేవంత్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీపాయము వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుపి పిరినకి నవీన్ గారు, సింగరేణి INTUC బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు గారు, సెక్రెటరీ గట్టయ్య గారు, మణుగూరు టౌన్ ప్రెసిడెంట్ శివ సైదులు గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు