గ్రేస్ మిషన్ స్కూల్లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందిన మృతదేహాలను సందర్శించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
తేదీ 03/11/2024
మణుగూరు మండలం
=====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో గ్రేస్ మిషన్ స్కూల్ లో ఈరోజు తెల్లవారుజామున గ్రేస్ మిషన్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉపేందర్,రత్నం, స్కూల్ గోడ పై ఉన్న జెండాను తొలగిస్తుండగా 11,kv సర్వీస్ వైర్ కు తగిలి విద్యుత్ షాపుతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు గ్రేస్ మిషన్ స్కూల్ కి వెళ్లి మృతదేహాలను సందర్శించి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు అనంతరం మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు తక్షణమే ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని మణుగూరు సిఐ సతీష్ కుమార్ గారిని ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు