మణుగూరు జడ్పీ హైస్కూల్లో మండల పాఠశాల స్థాయి క్రీడ పోటీలను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం
తేది :19/09/2024
మణుగూరు మండలం
———————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో జడ్పీ హైస్కూల్లో మణుగూరు మండలం పాఠశాల స్థాయి క్రీడ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించి అనంతరం మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు : ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు.సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ విజయ బావుటాను ఎగురవేయాలని అన్నారు. క్రీడల్లో కోకో,కబడ్డీ, వాలీబాల్,పోటీలలో పాల్గనేందుకు మండలంలోని 30 పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని క్రీడలు ఆడడం వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని మానసిక ఒత్తిళ్లు తట్టుకుని బాగా చదువుకునే శక్తి లభిస్తుందని ఆటలతోపాటు విద్య లో కూడా పోటీ తత్వంతో చదువుకోవాలని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుచేసి మెరుగైన విద్యను అందిస్తుందని తెలియజేశారు ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించి పలు సమస్యలను నా దృష్టికి తీసుకురాగా వెంటనే మణుగూరు జడ్పీ హైస్కూల్ లో గ్రౌండ్ లెవలింగ్ కొరకు 10 లక్షల రూపాయలు సాంక్షన్ చేశానని కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు