చేతివృత్తిదారులకు సువర్ణ అవకాశాలు శిక్షణ పొంది ఉపాధిని సొంతం చేసుకోండి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

తేదీ :19/09/2024
మణుగూరు మండలం
———————
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ నందు బీసీ డెవలప్మెంట్ అధికారిని ఇందిరా గారితో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కమ్మరి కుమ్మరి వడ్రంగి నాయి బ్రాహ్మణ రజక వడ్డెర అవసలి కంసాలి, కంచరి పూసల శిల్పులు జాలరి బెస్తవారు మేదరి మేర ఉప్పరి వారు ఇంటి నిర్మాణ పనులు ఉన్నవారు తదితరులు ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు
మొత్తం 16 కులవృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది లబ్ధిదారులు ముందుగా కామన్ సర్వీస్ సెంటర్ లో నమోదు చేసుకోవాలి నమోదు చేసుకునేందుకు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పుస్తకము కుల దృవీకరణ పత్రం తీసుకోవాలి ఇలా కామన్ సర్వీస్ సెంటర్ లో నమోదు చేసుకున్న లబ్ధిదారులకు ముందుగా మాస్టర్ ట్రైనీలతో ఐదు నుంచి 8 రోజులు పాటు శిక్షణ ఇస్తారు శిక్షణ సమయంలో రోజుకి 500 రూపాయల ఉపకార వేతనం అందజేస్తారు తరువాత ధ్రువీకరణ పత్రము మరియు గుర్తింపు కార్డు కూడా అందజేస్తారు శిక్షణ తర్వాత వీరికి 15వేల రూపాయల విలువగల యంత్ర సామాగ్రిని ఆయా చేతి వృత్తులను బట్టి వారికి అందజేస్తారు ఆ తరువాత లక్ష రూపాయల వరకు సంబంధిత బ్యాంకు ద్వారా రుణవును అందజేస్తారు ఈ రుణాన్ని లబ్ధిదారులు 18 వాయిదాలతో ఐదు శాతం వడ్డీతో చెల్లించవలెను .
బ్యాంకు రుణం లక్ష రూపాయలు … 
వడ్డీ శాతం ఐదు శాతం
మొదటి నెల 5000 మరియు 417 రూపాయలు
రెండో నెల అసలు 95000 మరియు 5000 మరియు 396 రూపాయలు
ఈ విధంగా 18 వాయిదాలలో లబ్ధిదారులు బ్యాంకు రుణమును  చెల్లిస్తే.. మరల బ్యాంక్ వారిద్వారా ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణాన్ని అందిస్తుంది ఇట్టి బ్యాంకు రుణాన్ని లబ్ధిదారులు 35 వాయిదాలలోఐదు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు బ్యాంకు రుణం రెండు లక్షలు వడ్డీ ఐదు శాతం మొదటి నెల 5550 మరియు 833 రూపాయలు రెండవ నెల అసలు 1,94,44 మరియు రూ 550 రూపాయలు మరియు 810 రూపాయలు
ఇలా బ్యాంకు రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది..

👉 కాటమయ్య (రక్ష భద్రతా సామాగ్రి )పథకం కల్లుగీత కార్మికుల కోసం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు గౌడ కులస్తులకు నూతనంగా కాటమయ్య( రక్ష భద్రతా సామాగ్రి )అనే పథకాన్ని ప్రవేశపెట్టింది గౌడ కులంలో 18 సంవత్సరాల నుండి తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కళ్ళు గీత కార్మికులకు ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి కిందపడే గాయాలు పాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి వారు తమ కులవృత్తిని కొనసాగాలించడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం లో భాగంగా పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా వందమందిని మంజూరు చేయాలని లక్ష్యంతో నిర్ణయించారు. ఒకవేళ సంబంధిత నియోజకవర్గం లో గౌడ కుల లో 18 సంవత్సరాలు నిండిన తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసేవారు లేకుంటే జిల్లాలో మరొక నియోజకవర్గ నుండి తీసుకోవచ్చు .
ఆప్కారి శాఖ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారు సంయుక్తంగా కలిసి పని చేస్తారు. ఆప్కారి శాఖలో నమోదు కాని వారు ఎవరైనా ఉన్నా కూడా వారిని నేరుగా ఎమ్మెల్యే ద్వారా రిఫర్ చేయబడుతూ ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరుగుతుంది .ఇలా గుర్తించిన వారిని కలెక్టర్ ఆమోదంతో మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ కల్లుగీత కార్మికుల ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ వద్దకు పంపడం జరుగుతుంది.
ఆ తర్వాత కలెక్టర్ గారి ఆమోదం పొందిన వారికి నూతన యంత్ర పరికరాలతో తాటిచెట్టు ఎక్కేందుకు శిక్షణ మాస్టర్ ట్రైనీలతో ప్రభుత్వం అందిస్తుంది
శిక్షణ తీసుకున్న వారికి కాటమయ్య రక్ష భద్ర సామాగ్రిని సుమారు రు.12000 విలువ చేసే సామాగ్రిని విడతలవారీగా అందజేస్తారని జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారిని ఇందిర ఎమ్మెల్యేకు వివరించారు.. ఈ అవకాశాలను నియోజకవర్గం జీవించే వారు సద్విని చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *