అకాల వర్షాలు నేపథ్యంలో వరదకు గురై మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన పినపాక ఎమ్మెల్యే శ్రీపాయం గారు
తేదీ :05/09/2024
అశ్వాపురం మండలం
————————
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన, తాటి అద్దెమ్మ, అదే గ్రామానికి చెందిన కల్లూరి నీలమయ్య గారు ఆదివారం నాడు కురిసిన భారీ వర్షానికి,వరదలో మృతి చెందినారు వీరి మృతి పట్ల ప్రభుత్వ అధికారులతో అదేరోజు మాట్లాడి కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేసిన పాయం గారు. తదుపరి ఈరోజు అశ్వాపురం ముంపు గ్రామాల పర్యటనలో భాగంగా, తాటి అద్దెమ్మ, కల్లూరి నీలమయ్య,గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.