భారీ వర్షాల నేపథ్యంలో అశ్వాపురం మండలంలో వరదకు గురైన ముంపు గ్రామాలలో పర్యటిస్తున్న పినపాక ఎమ్మెల్యే పాయం
తేదీ :05/09/2024
అశ్వాపురం మండలం
————————
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ఈరోజు గొందుగూడెం,ఎలకలగూడెం,కొత్తూరు, పాత గొందిగూడెం,భీమవరం,రామవరం,ఒడ్డు వారి గుంపు, వెంకటాపురం, గ్రామపంచాయతీలో ముంపు గ్రామాలలో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే పాయం గారు, ఎలకలగూడెం గొందుగూడెం సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఇసుక వాగు వంతెనను సందర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం గారు, పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిలను తక్షణమే నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభిస్తానని తెలియజేశారు తదుపరి వరద బాధితులు, ముంపు గ్రామస్తులతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు,వరద బాధితులు ఎవరు కూడా అధైర్య పడవద్దు అని వ్యవసాయం మరియు ఇల్లు కోల్పోయిన వారికి, ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందజేస్తామని తెలియజేశారు, ప్రభుత్వం అందజేసే ప్రతి పథకాన్ని నిరుపేదలకు అందజేసే విధంగా కృషి చేస్తామని, ప్రతి వాడకు సిసి రోడ్లు వేస్తామని, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, అయినా గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు , ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నిరుపేదలకు అందే విధంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు, తదుపరి, వరద ఉదృత వలన కొట్టుకుపోయిన మూడు ఆటో వాహనాలు యాజమానులకు ఆర్థిక సాయం అందించారు, మరో మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే గాని బయటికి రాకూడదని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి, అన్ని శాఖల అధికారులు, మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
