ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన కిరణ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో జరిగిన దారుణమైన ప్రమాదంలో 4 సంవత్సరాల చిన్నారి కిరణ్య ట్రాక్టర్ కింద పడి మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నిన్న కిరణ్య కుటుంబాన్ని పరామర్శించి, శోక సంతప్త కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆళ్లపల్లి మండలంలోని అనంతోగు గ్రామానికి చెందిన గలిగా నరేష్ గారి కుమార్తె కిరణ్య దారుణంగా మృతిచెందిన విషయం తెలిసిన తర్వాత, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఈ రోజు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాయం రామనరసయ్య, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.