అవగాహన సదస్సులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
హైదరాబాద్, తేదీ: 11-12-2024
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని MCRHRD ఇన్స్టిట్యూట్‌లో శాసన పరిషత్, శాసనసభ కార్య విధానం మరియు కార్యక్రమం నిర్వహణ నియామవళిపై గౌరవ సభ్యులకు అవగాహన సదస్సు ఈ రోజు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు పాల్గొని, శాసనసభ కార్యకలాపాలపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సదస్సు ముఖ్య ఉద్దేశం శాసనసభ్యులకు శాసన ప్రక్రియలపై అవగాహన కల్పించడం మరియు సమర్థ నిర్వహణ నైపుణ్యాలు అభివృద్ధి చేయడం అని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, “ఇలాంటి అవగాహన కార్యక్రమాలు శాసనసభలో నాణ్యమైన చర్చల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడతాయి” అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.