మణుగూరు మండల ప్రజా భవన్(ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) లో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి…. సింగరేణి వేబ్రిడ్జ్ కోల్ లారీలోడింగ్,అన్ లోడింగ్ లెవలింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి వారికి ఇస్తున్న వేతనాలను అలాగే మెడికల్, MBTC నీ ఫ్రీగా సింగరేణి సంస్థ చేయించాలని, సీఎం పిఎఫ్ సౌకర్యం కల్పించాలని అలాగే సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ను వారికి కేటాయించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆ సంఘ నాయకులు ఇవ్వడం అయినది… ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జక్కుల రాజబాబు, కృష్ణ, సిహెచ్ శంకర్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకీ నవీన్, గాండ్ల సురేష్, సుధాకర్, టౌన్ ప్రెసిడెంట్ భువనగిరి శివ సైదులు తదితరులు పాల్గొన్నారు…..