తేదీ: 10 నవంబర్ 2024, పినపాక మండలం
కూనారపు వారి వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు
పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ జివిఆర్ ఫంక్షన్ హాల్‌లో కూనారపు సత్యనారాయణ, నిర్మల గార్ల కుమారుడు ప్రియతమ్ మరియు శివకన్య గార్ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా పినపాక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే పాయం గారు వధూవరులకు అక్షింతలు వేసి వారికి సుఖసంతోషాలతో స్నేహపూర్వక జీవితం కావాలని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకకు పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.