మణుగూరు విప్పల సింగారంలో ఇంటింటా సర్వే ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు

 మణుగూరు మండలం  11,నవంబర్ ,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని విప్పల సింగారంలో పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు  సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, కుటుంబ అంశాలపై ఇంటింటా సర్వేను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభం కావడంపై, పినపాక ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ రోజు విప్పల సింగారం గ్రామానికి చెందిన పాల్వంచ రాములు గారి ఇంటి నుంచి ఈ సర్వే ప్రారంభించాము. ప్రతి ఒక్కరు సర్వే చేసే అధికారులకు సహకరిస్తూ తమ కుటుంబ వివరాలను అందించాలని అన్నారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు గారు, ఈ సర్వే ప్రతి ఇంటి యజమాని ద్వారా కుటుంబ వివరాలు సేకరించడం ద్వారా సమగ్రంగా చేయబడుతుందని చెప్పారు. సర్వే ద్వారా గ్రామాల సమస్యలు, అభివృద్ధి అవకాశాలు మరింత స్పష్టమవుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి , ఎండిఓ శ్రీనివాస్ , ఎం పి ఓ వెంకటేశ్వర్లు , మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *