వరదకి గురైన సుందరయ్య నగర్ , మేదర బస్తి, ప్రాంతంలో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం
తేదీ:02-09-2024
మణుగూరు మండలం
———————–
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో మూడు రోజులుగా భారీ వర్షా ల కారణంగా సుందరయ్య నగర్, మేదర బస్తి,లో పూర్తిగా పలు ఇండ్లు నీటిమట్టం అయిన తరుణంలో ఈరోజు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు సుందరయ్య నగర్, మేదర బస్తి లో పర్యటించి వరదకు గురైన బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, సుందరయ్య నగర్ నుంచి ప్రవహించే వాగుని సందర్శించారు, తదుపరి వరదకు గురైన ఇల్లను పరిశీలించారు తక్షణమే వరదకు గురైన అన్ని ఏరియాలలో బ్లీచింగ్ చెల్లించాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
