డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు 💐
తేదీ 14-04-2024
మణుగూరు మండలం
—————————————
ఈరోజు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ నందు రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి
నివాళులు అర్పించి మరియు . మణుగూరు అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
పాయం గారు మాట్లాడుతూ
బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటుపడిన మహానీయుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే పాయం గారు కొనియాడారు.దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాడని ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రానికి జవజీవం పోసిందని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని అన్నారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే పాయం గారు కొనియాడారు *
ఈ యొక్క కార్యక్రమానికి* ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
