మణుగూరు మున్సిపాలిటీలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీ
మణుగూరు మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీకి మున్సిపాలిటీ కమిషనర్ యాదగిరి, తహసిల్దార్ రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మణుగూరును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన తరువాత పట్టణంలో అభివృద్ధి పథకాలు వేగవంతమయ్యాయని అన్నారు. ర్యాలీ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగింది.
