అశ్వాపురంలో లబ్ధిదారులకు 7.50 లక్షల CMRF చెక్కుల పంపిణీ
తేదీ: 15-11-2024, అశ్వాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో అశ్వాపురం మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి 7,50,000 రూపాయల విలువ గల చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయాన్ని అందుకుని తన ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు. CMRF ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్న పాయం వెంకటేశ్వర్లు, లబ్ధిదారులు ఆ నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.