పినపాక మండలం పొట్లపల్లి గ్రామ పంచాయి తీలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు

తేదీ : 02-10-2024
పినపాక మండలం
=====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పొట్లపల్లి గ్రామ గ్రామపంచాయితీ లొ విద్య వైద్యం ఇరిగేషన్ ఫారెస్ట్ ఎలక్ట్రికల్ అగ్రికల్చర్ రెవిన్యూ ఇలా అన్ని శాఖల అధికారులతో ప్రజల సమస్యల గురించి గ్రామస్తుల సమక్షంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం జరిపి గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని ఆయా శాఖల అధికారులకు సంబందించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం పాయం గారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధికి కావలసిన నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్లానని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సానుకూలత వ్యక్తం చేశారని నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని సంక్షేమ పథకాలు నేరుగా పేదలకే చేరుతాయని ఏ సమస్య ఉన్న నేరుగా తమ దృష్టికి తేవాలని ఇందిరమ్మ ఇల్లు విషయంలో దళారుల మాటలు నమ్మొద్దని పారధర్మకంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలియజేశారు గ్రామస్తులు పలు సమస్యలపై ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,

ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు,పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *