రైతులకు బలమైన  ప్రభుత్వం – రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డికి పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు

రైతు సంక్షేమానికి మరో ముందడుగు… రైతు భరోసా నిధుల విడుదలపై కృతజ్ఞతలు

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆర్థిక భరోసాను మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా పినపాక నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్‌లు, పలువురు ఎమ్మెల్సీలు, సహచర ఎమ్మెల్యేల సమన్వయంతో ముఖ్యమంత్రిని కలిసి రైతు సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థికంగా మద్దతు లభిస్తోందని, ఇది రైతుల అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా తెలియజేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *