పినపాక నియోజకవర్గానికి శుభవార్త: పాయం వెంకటేశ్వర్లు గారి పట్టుదల ఫలించింది
హైదరాబాద్: పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈరోజు ఆర్ అండ్ బి మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అభ్యర్థనలు సమర్పించారు.
ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన బీటీ రోడ్లు, బ్రిడ్జిలు, సైడ్ డ్రైనేజీలు, రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్ మరియు డివైడర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే గారు మంత్రివర్యులను అభ్యర్థించారు. నియోజకవర్గంలో రోడ్ల మరమ్మత్తులకు సంబంధించిన నిధులను కూడా త్వరగా మంజూరు చేయాలని కోరారు.
శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన మంత్రి గారు, త్వరలోనే అవసరమైన నిధులు మంజూరు చేయడంపై హామీ ఇచ్చారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని, ప్రజలకు మౌలిక సదుపాయాలు చేరే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి గారు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి ఈ ప్రయత్నం పినపాక ప్రజల అభివృద్ధి పట్ల ఆయన కట్టుబాటును చాటిచెప్తోంది. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తిమేర సహకారం అందిస్తానని, ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని ఆయన వెల్లడించారు.
పినపాక ప్రజల అభిమానం, ఎమ్మెల్యే గారి పట్టుదల – అభివృద్ధి దిశగా మరో ముందడుగు!