సింగరేణి సిఎస్ఆర్ నిధులతో పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ
మణుగూరు: సింగరేణి సిఎస్ఆర్ నిధులతో మణుగూరు ఏరియా పరిసర, ప్రభావిత ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పన కోసం సింగరేణి సంస్థ చేయూత అందిస్తోంది. పాఠశాలల అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధుల వినియోగం అభినందనీయం” అని తెలిపారు. జి ఎం దుర్గం రామచందర్ మాట్లాడుతూ, “మణుగూరు ఏరియాలోని పాఠశాలలకు సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ మద్దతు అందిస్తుందని, భవిష్యత్‌లో కూడా ఈ సహకారం కొనసాగుతుందన్నారు.” కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.