శివలింగాపురం చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నా పినపాక ఎమ్మెల్యే పాయం

మణుగూరు, డిసెంబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలోని పరిశుద్ధ లూకా దేవాలయం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, క్రైస్తవ సోదరులకు ఈ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. పినపాక నియోజకవర్గ ప్రజలపై యేసు ప్రభువు చల్లని దీవెనలు కురిపించాలని ప్రార్థించారు.కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గారిని చర్చి పోస్టర్స్ ప్రత్యేకంగా ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు చైతన్య నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య అంశాలు:

  • ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు శివలింగాపురం చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
  • ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
  • క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
  • పినపాక నియోజకవర్గ ప్రజలపై యేసు ప్రభువు దీవెనలు కురిపించాలని ప్రార్థించారు.
  • చర్చి పోస్టర్స్ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించారు.
  • మండల కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *