మణుగూరులో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ హాస్టల్ సమీపంలో లబ్ధిదారుడు పెనమకూరు వెంకటరమణ గారి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం (08-03-2026) ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పినపాక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన గృహంలో అడుగుపెడుతున్న వెంకటరమణ గారి కుటుంబానికి ఎమ్మెల్యే గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలు సొంత ఇంట్లో సగర్వంగా జీవించాలన్న కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉద్ఘాటించారు.

 ఈ కార్యక్రమంలో డీటీ రామారావు, ఆర్‌ఐ గోపి, ఎంపీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఏఈ సంతోష్, స్థానిక పంచాయతీ సెక్రెటరీ, మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, గుట్ట మల్లారం సర్పంచ్ కారం పూజిత, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, వార్డు సభ్యులు మానస, రహీం పాషా, 14వ వార్డు అధ్యక్షులు దుగ్గంపూడి ఈశ్వర్ రెడ్డి, నాయకులు చింతల కృష్ణ, గద్దల ఆదిలక్ష్మి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *