ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళలను సత్కరించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

సమాజ ప్రగతిలో మహిళలదే కీలకపాత్ర

మణుగూరు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), మార్చి 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మణుగూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పినపాక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) పాయం వెంకటేశ్వర్లు గారు పలువురు మహిళలను శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. మహిళల సాధికారతతోనే దేశ, రాష్ట్ర పురోగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నేటి మహిళలు చదువుకే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, వ్యాపార, స్వయం ఉపాధి తదితర అన్ని రంగాల్లో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతి, రక్షణ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని అన్ని విధాలా ఎదగాలని ఆయన  లుపునిచ్చారు. పాల్గొన్న ప్రముఖులు, నాయకులు: ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, గుట్ట మల్లారం సర్పంచ్ కారం పూజిత, కూనవరం సర్పంచ్ ఎనిక శ్వేత, బోటి గూడెం ఉప సర్పంచ్ ధనలక్ష్మి, బుగ్గ సర్పంచ్ మాధవి, వార్డు సభ్యులు కొలపిన్నీ మానస, కృష్ణవేణి, చీమల వరాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలమూరి రాజు, జీవి, అబ్దుల్లా, వరలక్ష్మి, కోర్లకుంట అప్పారావు తదితర నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *