కట్టు మల్లారం పోడు భూమి సమస్యపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవ

కట్టు మల్లారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పోడు భూమి సమస్యపై పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామ ప్రజల నుంచి అందిన వినతులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ శాఖ అధికారులను కార్యాలయానికి పిలిపించి, పోడు భూముల సమస్యపై సమగ్రంగా చర్చించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భూస్వామ్య హక్కులు, సాగు సమస్యలు వంటి అంశాలను ఎమ్మెల్యే స్వయంగా వివరించి, చట్టపరమైన మార్గాల్లో త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని అధికారులకు సూచించారు.గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యను ఆలస్యం చేయకుండా పరిష్కరించాల్సిందిగా స్పష్టం చేశారు. గ్రామ ప్రజల హక్కులు పరిరక్షించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఫారెస్ట్ అధికారులు, లంక మల్లారం గ్రామ సర్పంచ్ జిగిడి ప్రసాద్ గారు, గ్రామ పెద్దలు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. తమ సమస్యపై స్పందించి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *