పోతిరెడ్డిపల్లిలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనుల పరిశీలన

📍 స్థలం: పోతిరెడ్డిపాలెం, పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
📅 తేదీ: 22-02-2026

పాయం వెంకటేశ్వర్లు పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై సుమారు రూ.65 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా వీక్షించి, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.

బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానిక గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవడంతో పాటు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే రవాణా ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం, ఉప సర్పంచ్ రామ్మోహన్, జానంపేట ఉపసర్పంచ్ దాట్ల రాజేష్, తొక్కుగూడెం సర్పంచ్, ఉప సర్పంచ్, ఉప్పక సర్పంచ్ మట్ట బాబురావు, ఉప సర్పంచ్ కోడం రామ్మోహన్రావు, బయ్యారం సర్పంచ్ సందీప్ రెడ్డి, వెంకట్రావుపేట సర్పంచ్ సుతారి సింధుజ, ఉపసర్పంచ్ మాటూరు రవీందర్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, రంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గుట్టయ్య, పేరం వెంకటేశ్వర్లు, అచ్చా నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *